వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహించనున్న అడెల్లి పోచమ్మ గంగ నీళ్ల జాతర ఏర్పాట్లపై దిలావర్పూర్‌లో సోమవారం వీడీసీ, ఆలయ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. అమ్మవారి ఆభరణాలను గోదావరి నదికి తీసుకెళ్లే సమయంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు.
జాతరను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసి, సమన్వయంతో పనిచేయాలని సభ్యులకు సూచించారు.
Comments
Loading comments...

