వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం అడెల్లి శ్రీ మహా పోచమ్మ దేవస్థానంలో శుక్రవారం 15 హుండీలను లెక్కించారు. ఆలయ ఈఓ భూమయ్య, దేవాదాయ శాఖ సహాయ కమీషనర్ పరిశీలకులు సుదర్శన్ ఆధ్వర్యంలో ఈ లెక్కింపు జరిగింది.
హుండీల ద్వారా మొత్తం రూ. 58,41,141 నగదు, 18 తులాల మిశ్రమ బంగారం, మూడున్నర కిలోల మిశ్రమ వెండి ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

