వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ నగరంలోని మేడ్చల్, నాగోల్, కొండాపూర్ ఆర్‌టీవో కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. పెండింగ్ ఫైళ్లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహనాల రిజిస్ట్రేషన్ల జారీ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలపై ఎనిమిది మంది అధికారుల బృందాలు ఏకకాలంలో విచారణ చేపట్టాయి.
సిబ్బందిపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఆర్‌టీఏ ఏజెంట్లు, డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకుల ద్వారా పనులు అక్రమంగా సాగుతున్నాయనే సమాచారంతో అధికారులు వారిని కూడా విచారించి వివరాలు సేకరిస్తున్నారు.
Comments
Loading comments...

