Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోమర్రు రోడ్డులో ప్రమాదం.. ఒకరి మృతి

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 08, 2026 7:06 PM ఏలూరుGeneral
కోమర్రు రోడ్డులో ప్రమాదం.. ఒకరి మృతి - Udayam
ముదినేపల్లి మండలం కోమర్రు రోడ్డు వద్ద శనివారం మధ్యాహ్నం జరిగిన రహదారి ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. మృతుడిని పెదపారుపూడి మండలం వానపాములకు చెందిన షేక్‌ నాగుల్‌ వలి (46)గా స్థానికులు గుర్తించారు. వెల్డింగ్‌ పని కోసం సింగరాయపాలెం వెళ్లి సహచరుడి వాహనంపై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణాలను హెడ్‌ కానిస్టేబుల్‌ రామారావు సేకరిస్తున్నారు.

Comments

G
Loading comments...