వార్తలకు తిరిగి వెళ్లండి

లింగాల మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో మంగళవారం ఉదయం ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. అక్రమంగా కలప తరలిస్తున్న వారి నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై ఈ దాడులు జరిగాయి.
సెక్షన్ ఆఫీసర్ రాంబాబు, బీట్ ఆఫీసర్ మురళీకృష్ణపై తనిఖీలు కొనసాగుతున్నట్లు సమాచారం. దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
Comments
Loading comments...

