వార్తలకు తిరిగి వెళ్లండి

బోధన్ పట్టణంలోని ఆటోనగర్ కాలనీలో రోడ్డు అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం పడితే రోడ్డు మొత్తం బురదమయంగా మారి రాకపోకలకు ఇబ్బందిగా ఉంటోందని కాలనీవాసులు తెలిపారు.
రాత్రి వేళల్లో పాములు సంచరిస్తున్నాయని, ఇప్పటికే ఇద్దరిని పాము కాటేయడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. అధికారులు, మున్సిపల్ కమిషనర్ కాలనీలో పర్యటించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

