Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్పత్రిలో వైద్యుల ఆలస్యంపై విమర్శలు

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 12:58 PM వరంగల్General
 ఆస్పత్రిలో వైద్యుల ఆలస్యంపై విమర్శలు - Udayam
వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు విధులకు ఆలస్యంగా వస్తున్నారన్న ఆరోపణలపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 9 గంటలకే ఓపీ ప్రారంభం కావాల్సి ఉండగా,కొందరు వైద్యులు 10.30 గంటల తర్వాత వస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఓపీతోపాటు పలు వైద్య సేవలు, ఆపరేషన్లు ఉదయమే నిర్వహించాల్సి ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రోగులు చెబుతున్నారు. ఆలస్యంగా వచ్చే వైద్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...