Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పతక విజేతలతో రేపు మోదీ భేటీ

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 4:43 PM జాతీయంక్రీడలు
పతక విజేతలతో రేపు మోదీ భేటీ - Udayam
జపాన్‌లో ఇటీవల జరిగిన ఆసియా పారా గేమ్స్‌లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులతో ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్‌ 5న భేటీ కానున్నారు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో సాయంత్రం 4.30 గంటలకు భారత బృందంతో ఆయన మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఐచి-నగోయాలో జరిగిన ఈ పోటీల్లో భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది.

Comments

G
Loading comments...