వార్తలకు తిరిగి వెళ్లండి

దిలావర్‌పూర్ మండల ఆశా వర్కర్లు బుధవారం చాకలి ఐలమ్మ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే అక్రమంగా అరెస్టులు చేస్తూ, తమ గోడును చెప్పుకునే అవకాశం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

