Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరుతడి పంటలను రైతులు సాగు చేయాలి

Follow Udayam on Google
p.g.murthy Jul 28, 2026 4:09 PM మంచిర్యాలGeneral
ఆరుతడి పంటలను రైతులు సాగు చేయాలి - Udayam
ఆరుతడి పంటలను రైతులు సాగు చేయాలని మంచిర్యాల జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, ఏడిఏ కృష్ణ సూచించారు. మంగళవారం మధ్యాహ్నం లక్షెట్టిపేట పట్టణంలోని రైతు వేదికలో నిర్వహిస్తున్న రైతు మేళాను వారు సందర్శించారు. వర్షాభావ పరిస్థితులతో వరి పంటను సాగు చేయడం మంచిది కాదన్నారు. ఆ పంటకు బదులు ఆరుతడి పంటలైన కంది, పెసర, మినుము, మొక్కజొన్న, జొన్ కూరగాయ పంటలను సాగు చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్, ఏఈవోలు, తదితరులు, పాల్గొన్నారు

Comments

G
Loading comments...