Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీని ప్రైవేటీకరించవద్దు: సీఐటీయూ

Follow Udayam on Google
B Ganga Sep 13, 2026 9:11 PM పార్వతీపురం మన్యంGeneral
ఆర్టీసీని ప్రైవేటీకరించవద్దు: సీఐటీయూ - Udayam
పాలకొండ ఆర్టీసీ డిపోలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం కరపత్రాలు పంపిణీ చేశారు. విద్యుత్ బస్సుల పేరుతో ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటు సంస్థలకు అప్పగించవద్దని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు డిమాండ్ చేశారు. విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి నిర్వహించాలని కోరారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 12 వేల పోస్టులను భర్తీ చేసి, కొత్తగా 4 వేల బస్సులను ప్రవేశపెట్టాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...