Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల కిటకిట

Follow Udayam on Google
sudheer Aug 28, 2026 1:30 PM కరీంనగర్General
ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల కిటకిట - Udayam
రాఖీ పౌర్ణమి వేళ కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. రాఖీ కట్టేందుకు వెళ్లేవారితో పాటు తిరుగు ప్రయాణికులతో ప్లాట్‌ఫారమ్‌లు నిండిపోయాయి. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్‌ఎం బి.రాజు, డిప్యూటీ ఆర్‌ఎం ఎస్.భూపతిరెడ్డి బస్టాండ్‌లో పర్యటించారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా అన్ని రూట్లలో బస్సుల నిర్వహణను స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

Comments

G
Loading comments...