Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరిక రేవుల గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యూత్ కనెక్ట్ కార్యక్రమం

Follow Udayam on Google
devendra Aug 18, 2026 8:05 PM తూర్పుగోదావరిGeneral
ఆరిక రేవుల గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యూత్ కనెక్ట్ కార్యక్రమం - Udayam
బిక్కవోలు మండలం ఆరికరేవుల గ్రామంలో ఎస్‌ఐ రవి చంద్ర కుమార్ ఆధ్వర్యంలో ‘కనెక్ట్ యూత్’ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 100 మంది పాల్గొన్న ఈ సమావేశంలో డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, సాంకేతికతను బాధ్యతాయుతంగా వాడుకోవాలని, గ్రామ శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని ఎస్‌ఐ రవిచంద్ర కోరారు.

Comments

G
Loading comments...