వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో మంగళవారం శివాలయంలో పరిశుద్ధ పనులను చేపట్టారు. వర్షాకాలం సందర్భంగా ఆలయం ఆవరణలో పిచ్చి మొక్కలు వేపుగా పెరిగి భక్తులకు ఇబ్బందిగా మారాయి.
ఈ విషయంపై ఆలయ కమిటీ సభ్యులు సర్పంచ్ నర్సా గౌడ్ కు విన్నవించారు. వెంటనే స్పందించి పారిశుద్ధ్య కార్మికులతో ఆలయం చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

