వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మీనర్సాపురంలోని శ్రీ నాగులమ్మ ఆలయంలో ఆదివారం పొట్ట పండగను ఆదివాసీ పూజారులు, వడ్డెలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆలయ స్థంభాలు, గద్దెలను శుద్ధి చేసి, కొత్తగా పండిన చిరుధాన్యాలతో నైవేద్యం తయారు చేశారు.
ఆలయ ప్రధాన పూజారి బాడిశ రామకృష్ణ స్వామిజీ (దేవర బాల) ఇంటి నుంచి డోలి వాయిద్యాల నడుమ నైవేద్యాన్ని ఆలయానికి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Comments
Loading comments...

