వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేటలో పలు ప్రైవేట్ పాఠశాలలు ఆదివారం కూడా తరగతులు నిర్వహిస్తున్నాయని అగ్రహారం సర్పంచ్ మామిండ్ల కిషన్ ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు నిర్వహించడం వల్ల విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోందన్నారు.
వారానికి ఒకరోజు సెలవు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఆదివారం తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలను విద్యాశాఖ అధికారులు తనిఖీ చేసి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కిషన్ కోరారు.
Comments
Loading comments...

