Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిపూడిలో ఎస్సై పల్లెనిద్ర కార్యక్రమం

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 9:46 AM బాపట్లGeneral
ఆదిపూడిలో ఎస్సై పల్లెనిద్ర కార్యక్రమం - Udayam
కారంచేడు మండలం ఆదిపూడిలో సోమవారం రాత్రి ఎస్సై పులి గోపి పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలు, శాంతిభద్రతల పరిస్థితిపై ఆరా తీశారు. ప్రజలు తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఎస్సై సూచించారు.

Comments

G
Loading comments...