Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారులకు ఆధార్‌.. అందరికీ అప్‌డేట్‌

Follow Udayam on Google
భరత్ తేజ Aug 11, 2026 10:17 AM అనంతపురంఆంధ్రప్రదేశ్
చిన్నారులకు ఆధార్‌.. అందరికీ అప్‌డేట్‌ - Udayam
అనంతపురం జిల్లాలో ఈ నెలలో 71 పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ప్రత్యేక ఆధార్ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఆధార్ సేవలను తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రజలకు మరింత చేరువ చేస్తామని చెప్పారు. శిబిరాల్లో బయోమెట్రిక్, ఆధార్ డాక్యుమెంట్ల అప్‌డేట్‌తో పాటు 0-5 ఏళ్ల పిల్లలకు కొత్త ఆధార్ నమోదు, ఇతర నవీకరణ సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...