వార్తలకు తిరిగి వెళ్లండి

మెర్సిడెస్ బెంజ్ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ జీఎల్‌సీని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభించారు. పుణె సమీపంలోని చకన్ ప్లాంట్‌లో ఈ కారు ఉత్పత్తి ప్రారంభమైంది. 94 కిలోవాట్ బ్యాటరీతో రూపొందించిన ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 711 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.
దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.78.5 లక్షలు. బుకింగ్స్ ప్రారంభించిన 36 గంటల్లోనే 550కు పైగా ఆర్డర్లు వచ్చినట్లు కంపెనీ తెలిపింది.
Comments
Loading comments...

