వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు మురుకంబట్టు ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు 600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. వేలూరుకు చెందిన జైకుమార్, మహమ్మద్ అలీలను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా గంజాయి లభించినట్లు పోలీసులు తెలిపారు.
ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు చిత్తూరు తాలూకా పోలీసులు ఈ చర్య చేపట్టారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...

