వార్తలకు తిరిగి వెళ్లండి

కాశీబుగ్గ టౌన్ పోలీసులు ఒడిశా పర్లాకిమిడి నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న 32.590 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. 16 ప్యాకెట్లలో గంజాయిని రూ.80 వేలకు కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది.
రవాణాకు ఉపయోగించిన మూడు బ్యాగులను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాశీబుగ్గ నుంచి పలాస రైల్వే స్టేషన్ వైపు వెళ్తుండగా నిందితులను పట్టుకున్నట్లు డీఎస్పీ టి. భవాని తెలిపారు.
Comments
Loading comments...

