Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

27న పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామ, వార్డు సభలు

Follow Udayam on Google
madhu Aug 26, 2026 5:05 PM ములుగుGeneral
27న పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామ, వార్డు సభలు - Udayam
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఈ నెల 27న అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ హేమంత్ బోర్కడే తెలిపారు. ఈ సభల్లో అధికారులు ఓటరు జాబితాను చదివి వినిపిస్తారని పేర్కొన్నారు. ఓటర్లు తమ పేరు, చిరునామా తదితర వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. కొత్త ఓటరు నమోదుకు ఫారం-6, తొలగింపుపై అభ్యంతరాలకు ఫారం-7, వివరాల సవరణకు ఫారం-8 వినియోగించుకోవాలని తెలిపారు.

Comments

G
Loading comments...