Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆశ్రమ పాఠశాలలో 25 మంది విద్యార్థినులు అస్వస్థత

Follow Udayam on Google
రచన దేవి Aug 03, 2026 3:50 PM వరంగల్General
ఆశ్రమ పాఠశాలలో 25 మంది విద్యార్థినులు అస్వస్థత - Udayam
వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం అనంతరం వాంతులు, విరోచనాలు, కడుపునొప్పితో బాధపడడంతో వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. విద్యార్థినులు అస్వస్థతకు గురైనప్పటికీ వార్డెన్‌, ఇతర సిబ్బంది పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Comments

G
Loading comments...