Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

24 గంటల విద్యుత్ కోసం బీఆర్ఎస్ ధర్నా

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 2:33 PM యాదాద్రి భువనగిరిGeneral
24 గంటల విద్యుత్ కోసం బీఆర్ఎస్ ధర్నా - Udayam
వ్యవసాయానికి 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ అడ్డగూడూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. కరెంటు కోతలతో పంట పొలాలు ఎండిపోతున్నాయని నేతలు ఆరోపించారు. తక్షణమే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, మహేందర్ నాథ్, దేవగిరి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...