వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ అంబేడ్కర్ నగర్‌లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 220 ద్విచక్ర వాహనాలు, 29 ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
తనిఖీల్లో మద్యం, మట్కా కేసులు నమోదు చేశారు. నంబర్ ప్లేట్ లేని, నకిలీ నంబర్ ప్లేట్ ఉన్న ఆరు వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు.
Comments
Loading comments...

