Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

19 మంది వైసీపీ నేతలకు 41ఏ నోటీసులు

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 3:12 PM నెల్లూరుGeneral
19 మంది వైసీపీ నేతలకు 41ఏ నోటీసులు - Udayam
కోవూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డితో పాటు మరో 18 మంది వైసీపీ నేతలకు ఇందుకూరుపేట పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. డీఎస్సీ అక్రమాలను వ్యతిరేకిస్తూ ఇటీవల నిర్వహించిన నిరసన ర్యాలీ నేపథ్యంలో ఈ నోటీసులు ఇచ్చారు. అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ నిర్వహించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు బుధవారం 19 మంది నేతలకు నోటీసులు అందజేశారు.

Comments

G
Loading comments...