వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద పనిచేసిన శ్రామికులకు 12 వారాలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు రూ.10 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
వర్షాభావ పరిస్థితులతో ఉపాధి పనులపై ఆధారపడుతున్న కూలీలు వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలోనే నగదు వారి ఖాతాల్లో జమ అవుతుందని డ్వామా అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

