Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి

Follow Udayam on Google
K Anuradha Sep 10, 2026 4:08 PM శ్రీకాకుళంGeneral
యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి - Udayam
ఎచ్చెర్ల(M)ముద్దాడ జడ్పీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రిప్‌ కరెంట్‌, డ్రగ్స్‌, పోక్సో చట్టంపై ఎస్‌ఐ జి.హరికృష్ణరావు అవగాహన కల్పించారు. సముద్రంలో రిప్‌ కరెంట్‌ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రాణ రక్షణ చర్యలను వివరించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, అక్రమ రవాణా, వినియోగంపై సమాచారం పోలీసులకు ఇవ్వాలని సూచించారు. బాలికల రక్షణ, పోక్సో చట్టంపై వివరించారు.

Comments

G
Loading comments...