వార్తలకు తిరిగి వెళ్లండి

యూత్ ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత వుషు క్రీడాకారిణిగా మణిపుర్‌కు చెందిన లాంచెంబి చాను చరిత్ర సృష్టించింది. మహిళల చాంగ్‌క్వాన్ కంబైన్డ్ ఈవెంట్‌లో 18.039 పాయింట్లతో కాంస్యం గెలిచింది.
ఈ ఈవెంట్‌లో ఈజిప్ట్‌కు చెందిన సొండోస్ (18.660) స్వర్ణం, వెనెజువెలాకు చెందిన వలేరియా (18.199) రజతం సాధించారు. ప్రస్తుత యూత్ ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటివరకు ఒక రజతం, రెండు కాంస్య పతకాలు గెలుచుకుంది.
Comments
Loading comments...

