Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీ పాఠశాలలో టీచర్ హత్య.. నిందితుడి ఆత్మహత్య

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 2:44 PM జాతీయంGeneral
ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేరీ జిల్లాలో ప్రైవేట్ పాఠశాల మహిళా టీచర్ హత్యకు సంబంధించిన సీసీటీవీ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. సావుద్ అన్సారీ అనే వ్యక్తి పాఠశాలలోకి తుపాకీతో ప్రవేశించి, విద్యార్థుల ముందే ఆమెను సమీపం నుంచి కాల్చి చంపాడు. అనంతరం అదే ఆయుధంతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...