Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చమురు కేంద్రంలో పేలుడు.. ఒకరు మృతి

Follow Udayam on Google
Anuroop Nov 06, 2026 5:26 PM జాతీయంGeneral
అస్సాంలోని దిబ్రూగఢ్‌ జిల్లా తెంగాఖాట్‌లో ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ చమురు నిల్వ కేంద్రంలో శుక్రవారం పేలుడు సంభవించి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. వాల్వ్‌ మరమ్మతులు చేస్తుండగా పేలుడు సంభవించినట్లు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించగా, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...