Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: హోం మంత్రి అనిత

Follow Udayam on Google
Sonia Jun 15, 2026 3:18 PM అమరావతిGeneral
యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: హోం మంత్రి అనిత - Udayam
ఎన్డీఏ రెండేళ్ల పాలనలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ పథకాలతో శరవేగంగా దూసుకెళ్తోందని హోం మంత్రి అనిత తెలిపారు. గంజాయి, డ్రగ్స్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని అనిత సూచించారు. యువత కోసం మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, తల్లిదండ్రుల త్యాగాలను గుర్తించి ఉన్నత లక్ష్యాల దిశగా పయనించాలని ఆమె పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...