వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లిలో యువ రైతు రాజు(28) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. పొలం దున్నేందుకు వెళ్లిన ఆయన చెరువు శివారులో గాయాలతో కనిపించగా, ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
చెరువులో ట్రాక్టర్ కనిపించగా, రాజు సుమారు 200 మీటర్ల దూరంలో పడి ఉన్నాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

