Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువకుల గంజాయి జల్సాలకు బ్రేక్‌

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 28, 2026 12:32 PM మహబూబాబాద్ General
యువకుల గంజాయి జల్సాలకు బ్రేక్‌ - Udayam
మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం ముల్కలపల్లి శివారులో గంజాయి రవాణా చేస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద 5.725 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చంద్రమౌళి తెలిపారు. ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మూడు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉండగా గాలింపు చేపట్టారు.

Comments

G
Loading comments...