Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువత చెంతకే బ్యాంకింగ్‌ సేవలు

Follow Udayam on Google
విహార్ Aug 19, 2026 9:14 AM వాణిజ్యంవాణిజ్యం
యువత చెంతకే బ్యాంకింగ్‌ సేవలు - Udayam
యువతకు బ్యాంకింగ్‌ సేవలను మరింత చేరువ చేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారు. అక్టోబర్‌ 2 నుంచి నెలరోజుల పాటు 16 ఏళ్లు పైబడిన వారికోసం ‘బ్యాంకింగ్‌ ఫర్‌ యూత్‌’ ప్రచారం చేపట్టాలని చెప్పారు. కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో ఖాతాలు, రుణాలు, పెట్టుబడులు, క్రెడిట్‌ స్కోర్లపై అవగాహన కల్పిస్తూ యువతతో దీర్ఘకాలిక అనుబంధం పెంచుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...