వార్తలకు తిరిగి వెళ్లండి

మాదాపూర్‌లోని ఓయో రూమ్‌లో షారోన్ నిఖిత టోప్నో అనే యువతి హత్యకు గురవడం కలకలం రేపింది. గదిలో రక్తపు మరకలు ఉండటంతో ప్రియుడు శ్రీనివాస రవితేజనే హంతకుడనే అనుమానాలతో పోలీసులు గాలింపు చేపట్టారు.
ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి అనంతరం మృతదేహాన్ని జార్ఖండ్ నుంచి వచ్చిన తల్లిదండ్రులకు అప్పగించారు. పరారీలో ఉన్న నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తు ముమ్మరం చేశాయి.
Comments
Loading comments...

