Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లారీ ఢీకొని యువకుడి మృతి

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 16, 2026 4:42 PM ఖమ్మంGeneral
లారీ ఢీకొని యువకుడి మృతి - Udayam
ఖమ్మం జిల్లా కల్లూరు ఎన్‌ఎస్పీ క్రాస్ రోడ్డు వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ బైక్‌ను ఢీకొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని నారాయణపురం గ్రామానికి చెందిన మెరుగు గోపి (22)గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంతో ఆయన స్వగ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.

Comments

G
Loading comments...