Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముందస్తు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు

Follow Udayam on Google
Harika Jun 18, 2026 12:26 PM నల్గొండGeneral
ముందస్తు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు - Udayam
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల కోసం విద్యార్థులు చేపట్టిన నిరసనను ప్రభుత్వం అణచివేస్తోందని బీఆర్‌ఎస్‌వీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండలో ఆందోళనలకు సిద్ధమైన నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడంపై వారు నిప్పులు చెరిగారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కంటే అణచివేతకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. అక్రమ నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని, సమస్యలు తీరే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...