వార్తలకు తిరిగి వెళ్లండి

పెదపారుపూడి మండలం యలమర్రు గ్రామంలో ఏళ్లుగా కొనసాగుతున్న మురుగు సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మురుగు నీరు నిలిచిపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పక్కనే అంగన్వాడీ కేంద్రం ఉండటంతో చిన్నపిల్లలు బయటకు వచ్చినప్పుడు మురుగు నీటిలో పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి మురుగు నీటిని తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Loading comments...

