పరిశ్రమలో అగ్నిప్రమాదం.. కలకలం

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం హయతాబాద్ సమీపంలోని చందనవెల్లి పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ట్రీ ఫాయిల్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికంగా కలకలం రేగింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...
