5 సెకన్లలో ఐదుసార్లు చెంపదెబ్బలు

హరియాణాలోని చర్ఖీ దాద్రీలో విధుల్లో ఉన్న మహిళా వ్యవసాయ అధికారిపై మరో మహిళ దాడికి పాల్పడింది. కేవలం ఐదు సెకన్లలో ఐదుసార్లు చెంపదెబ్బలు కొట్టడంతోపాటు కులం పేరుతో దూషించిందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితురాలి ఫిర్యాదుతో మమత సహా ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. గాయపడిన అధికారికి ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయితే ఇప్పటివరకు నిందితులను అరెస్టు చేయలేదు.
Comments
Loading comments...
