వార్తలకు తిరిగి వెళ్లండి
వైకాపా నేత రూ.4 కోట్ల భూదందా

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అనుచరుడు జింకల వెంకటేశ్వర్లు 31 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమిని అక్రమంగా ఆక్రమించాడు. చుట్టుపక్కల రైతులను బెదిరించి అగ్రిమెంట్లు రాయించుకున్న సదరు నాయకుడు, ఆ భూమిని తెలంగాణకు చెందిన ఒక వ్యక్తికి రూ.4 కోట్లకు విక్రయించాడు.
గత ప్రభుత్వ హయాంలో అధికారుల సహకారంతో సాగిన ఈ భూబాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ భూమిలో కంచె వేసి తోటలు పెంచుతుండగా, కూటమి ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవడం లేదని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...