Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి ఆంజనేయస్వామికి ప్రత్యేక ఆకుపూజలు

Follow Udayam on Google
Sai Nath Oct 20, 2026 1:37 PM యాదాద్రి భువనగిరిGeneral
యాదాద్రి ఆంజనేయస్వామికి ప్రత్యేక ఆకుపూజలు - Udayam
యాదాద్రి క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండపై విష్ణుపుష్కరిణి వద్ద ఉన్న ఆలయంలో అర్చకులు పంచసూక్తాలు, మన్యుసూక్తాలు పఠిస్తూ అభిషేకం చేశారు. అనంతరం స్వామివారిని సింధూరం, పూలతో అలంకరించి నాగవల్లి దళార్చనలు నిర్వహించారు. పాతగుట్ట ఆలయంలోనూ స్వామివారికి పంచామృతాభిషేకం, ఆకుపూజలు చేశారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Comments

G
Loading comments...