వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా సాధికారత, స్వయం ఉపాధి లక్ష్యంగా తెలంగాణ పోలీస్ విమెన్ సేఫ్టీ వింగ్ ‘స్త్రీ రైడ్స్’ ప్రాజెక్టును ప్రారంభించింది. డీజీపీ సీవీ ఆనంద్ దీనిని లాంచ్ చేయగా, మొదటి విడతలో 55 మంది మహిళలకు టూ, త్రీ వీలర్ డ్రైవింగ్ శిక్షణ ఇచ్చారు.
రవాణా, డెలివరీ రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచి, వారిపై జరిగే వేధింపులను అరికట్టడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం. ఇకపై మహిళలు స్వయం ఉపాధితో రవాణా రంగంలో దూసుకుపోనున్నారు.
Comments
Loading comments...

