Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా శక్తి సూపర్‌ బజార్లు

Follow Udayam on Google
Ravi Shukla May 26, 2026 10:46 AM హైదరాబాద్General
మహిళా శక్తి సూపర్‌ బజార్లు - Udayam
రాష్ట్రంలో కార్పొరేట్‌ తరహాలో 'మహిళా శక్తి సూపర్‌ బజార్‌'లను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తొలి దశలో 119 నియోజకవర్గాల్లో వీటికి స్థలాలు కేటాయిస్తామన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే రైస్‌మిల్లులు, గోదాములు నిర్మిస్తామని, దీనికోసం సున్నా వడ్డీకే బ్యాంకు రుణాలు అందిస్తామని స్పష్టం చేశారు. సోమవారం వర్చువల్‌గా 8,000 మహిళా భవనాలకు సీఎం శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలే నేరుగా వడ్లు కొనుగోలు చేసి ప్రభుత్వానికి బియ్యం ఇచ్చేలా చర్యలు ఉంటాయన్నారు. 2034 నాటికి కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు.

Comments

G
Loading comments...