Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటో డ్రైవర్‌పై మహిళల ఫిర్యాదు

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 14, 2026 7:50 AM బాపట్లGeneral
ఆటో డ్రైవర్‌పై మహిళల ఫిర్యాదు - Udayam
బాపట్లకు చెందిన ఆటో డ్రైవర్ రాజేష్ మహిళలను లైంగికంగా వేధిస్తూ, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఇద్దరు బాధితులు ఏఎస్పీ రమణమూర్తికి ఫిర్యాదు చేశారు. గతంలో ఇతనిపై పలు పోలీస్ స్టేషన్లలో రౌడీషీట్, పోక్సో కేసులు నమోదయ్యాయి. జైలు నుంచి వచ్చాక కూడా నిందితుడు తమను చంపేస్తానని బెదిరిస్తున్నాడని, ఆస్తులు రాయించుకోవడానికి చూస్తున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఏఎస్పీ ఆదేశించారు.

Comments

G
Loading comments...