Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇనుప గ్రిల్స్‌లో ఇరుక్కున్న మహిళ కాలు

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 05, 2026 8:36 AM జనగామ General
ఇనుప గ్రిల్స్‌లో ఇరుక్కున్న మహిళ కాలు - Udayam
జనగామలోని ఆర్డీవో కార్యాలయం ప్రధాన గేటు వద్ద శనివారం ఒక మహిళ కాలు ఇనుప గ్రిల్స్‌లో ఇరుక్కుపోయి గంటన్నర పాటు విలవిలలాడింది. నర్మెట్ట మండలం మచ్చుపహాడ్‌కు చెందిన రమ్య అనే మహిళ భూమికి సంబంధించిన పని ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఎస్సై చెన్నకేశవులు స్థానిక వెల్డింగ్‌ దుకాణ సిబ్బంది సాయంతో గ్రిల్స్ రాడ్‌ను కత్తిరించి ఆమె కాలును సురక్షితంగా బయటకు తీశారు. నిరంతరం ప్రజలు తిరిగే జనరల్ ఆసుపత్రి, ఆర్డీవో కార్యాలయాల గేట్ల వద్ద ఉన్న ఇలాంటి ప్రమాదకర గ్రిల్స్‌ను వెంటనే తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...