వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్య విద్య సంచాలకురాలిగా (అకడమిక్) డాక్టర్ ఎం.రమాదేవిని నియమిస్తూ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సూర్యాపేట ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమెను తాత్కాలిక పదోన్నతిపై ఈ పదవికి ఎంపిక చేశారు.
1993లో ఉస్మానియా మెడికల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించిన డాక్టర్ రమాదేవి, ప్రస్తుతం అకడమిక్ డీఎంఈగా నియమితులు కావడం పట్ల ప్రభుత్వ, జూనియర్ వైద్యుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెను అభినందించాయి.
Comments
Loading comments...

