వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పులు, అవినీతి తప్ప కాంగ్రెస్, భారాస పార్టీలు తెలంగాణకు చేసిందేమీ లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఆ రెండు పార్టీలు కలిసి రాష్ట్ర ప్రజలపై రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం మోపాయని, భారాస దోచుకున్న సొమ్మును ఫాంహౌస్‌కు తరలిస్తే, కాంగ్రెస్ దిల్లీ పెద్దలకు పంపుతోందని జగిత్యాల జిల్లా పర్యటనలో ఆరోపించారు.
మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌లు కష్టపడి పైకొచ్చిన నాయకులని కొనియాడిన ఆయన.. 20 ఏళ్ల రాజకీయ జీవితం పూర్తి చేసుకున్న రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు
Comments
Loading comments...

