Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొసలి దాడిలో మహిళ మృతి

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 06, 2026 7:09 AM జాతీయంGeneral
మొసలి దాడిలో మహిళ మృతి - Udayam
ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌ జిల్లాలో సరయూ నది అనుసంధాన కాలువ వద్ద కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన కేతకీ దేవి (50) అనే మహిళపై మొసలి దాడి చేసి నీటిలోకి లాక్కెళ్లింది. పోలీసులు, అటవీశాఖ అధికారుల సహాయంతో ఆదివారం ఆమె మృతదేహాన్ని వెలికితీశారు. రెండు రోజుల క్రితమే ఇదే ప్రాంతంలోని చౌధరీ చరణ్‌సింగ్‌ కాలువ నుంచి రోడ్డు మీదకు వచ్చిన మరో మొసలిని అటవీశాఖ అధికారులు పట్టుకుని సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టారు.

Comments

G
Loading comments...